త్రివర్ణం లుక్కులో ఆకట్టుకున్న టాప్ బాలీవుడ్ బ్యూటీస్

బాలీవుడ్ సెలబ్రిటీలు ఫ్యాషన్ వరల్డ్ లో ఎంత కొత్తగా ఆలోచిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి డ్రెస్ వేసినా కూడా సోషల్ మీడియాలో ఆ లుక్స్ వైరల్ అవ్వాల్సిందే. సాధారణ జీన్స్ నుండి ఫాన్సీ బాల్ గౌన్ వరకు, వారు ఎలా కనిపించినా కూడా సరికొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఇక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ దుస్తులలో ఈ బాలీవుడ్ బ్యూటీస్ ని చూస్తే కొంత ఆశ్చర్య పోవాల్సిందే.

ప్రియాంక చోప్రా రెడ్ ఆరెంజ్ మిక్సీడ్ కలర్ డ్రెస్ లో సరికొత్తగా ఆకట్టుకోగా దీపికా పదుకొనె వైట్ డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచింది. ఇక యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ గ్రీన్ డ్రెస్ లో కనిపించి అంధరికంటే ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. మొత్తంగా ఈ ముగ్గురు భామలు త్రివర్ణంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ వరల్డ్ వైరల్ అవుతున్నాయి.