Home సినిమా వార్తలు ” డిస్కో రాజా ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

” డిస్కో రాజా ” ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

 

 

మాస్ మహా రాజ ర‌వితేజ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ” డిస్కో రాజా “ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటింస్తున్న ఈ సినిమాకి స్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

 

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ….
ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా డిస్కో రాజా. సినిమా చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. వి.ఐ.ఆనంద్ సినిమాను బాగా తీశాడు. వెన్నెల కిషోర్, సునీల్, బాబీ సింహ తో బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్స్ సభ నటేష్ , తన్య హాప్ బాగా చేశారు. కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని బాగా చేశాడు. నేను చూస్తూ పెరిగిన పాత్రలు ఈ సినిమాలో చేశాను, అందరికి నచ్చుతాయి. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. నిర్మాత రామ్ తాళ్లూరి తో చేసిన ఈ రెండో సినిమా నిరుత్సాహ పరచదు. జనవరి 24న మీలాగే నేను ఈ సినిమా కోసం వేచి చూస్తున్నాను అన్నారు.

 

డైరెక్టర్ విఐ. ఆనంద్ మాట్లాడుతూ…
నేను బిగ్ స్టార్ తో చేస్తున్న సినిమా ఇది. రవితేజ గారు నా టైగర్ సినిమా చూసి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆయన నన్ను, నా మూవీస్ ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ రవితేజ గారితో సినిమా చెయ్యాలి, ఆయనతో చాలా నేర్చుకోవాలి, నేను నేర్చుకున్నాను. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సినిమాకు కుదిరాయి. బాబీ సింహ, పాయల్, సభ నటెష్ మిగిలిన ఆర్టిస్ట్స్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి అన్నారు.

 

సునీల్ మాట్లాడుతూ….
చాలా కాలం తరువాత మంచి సినిమాలో నటించాను. రవితేజ గారికి థాంక్స్, కొత్తగా మరియు గొప్పగా ఉండబోతుంది డిస్కోరాజా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు.

 

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ….
సినిమా ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, పాయల్, సభ గారికి బెస్ట్ విశేష్. నేను రాజది గ్రేట్ సినిమా తీసాను రవితేజ గారితో మళ్ళీ ఎప్పుడెప్పుడు వర్క్ చెయ్యాలని ఎదురు చూస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

 

డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ….
నిర్మాత రామ్ తాళ్లూరి గారికి గుడ్ లక్, డైరెక్టర్ ఆనంద్ ఈ సినిమాకు డిస్కోరాజా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. మా బావ రవితేజ ఎనర్జీతో ఎవ్వరూ మ్యాచ్ అవ్వలేరు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్న , ఆనంద్ కు ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

 

హీరోయిన్ సభ నటెష్ మాట్లాడుతూ….
నేను రవితేజ గారి పెద్ద అభిమానిని, రవితేజ గారి ఎనర్జీ ఈ సినిమాకు పెద్ద అసెట్. ఆయనతో నటించడం మెమొరబుల్ ఎక్స్పిరీయన్స్. డైరెక్టర్ విఐ. ఆనంద్ గారు చాలా క్రియేటివ్ గా సినిమా తీశారు, తమన్ గారి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. నేను అందరిలానే జనవరి 24న ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అన్నారు.

 

డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ….
రవితేజకి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఆనంద్ ఈ సినిమాకు డిస్కోరాజా అనే టైటిల్ పెట్టినప్పుడే సక్సెస్ అయ్యారు. విజువల్స్ అన్ని బాగున్నాయి, టీజర్స్, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. సునీల్ , వెన్నెల కిషోర్, బాబీ సింహ ఇలా అందరికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.