పొగ‌త్రాగుట‌, మ‌ద్యం సేవించుటే కాక అప్ర‌మ‌త్తం లేకుండా కూడా హానిక‌ర‌మే: డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల

దేశంలో సైబ‌ర్ నేర‌గాళ్ల అక్ర‌మాలు పెరిగిపోతునే ఉన్నాయి. సామాన్యులే కాకుండా.. ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు ప్ర‌ముఖుల్ని కూడా వ‌ద‌ల‌డం లేదు. తాజాగా నితిన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన భీష్మ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు మోసం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విష‌యంపై డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ.. సైబ‌ర్ నేరానికి మోస‌పోయిన నేను రెండు రోజుల క్రితం సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాను. న‌వీన్ అనే వ్య‌క్తి నుంచి కాల్ వ‌చ్చింది. అయితే మా ఇద్ద‌రికి తెలిసిన వ్య‌క్తి నా స్నేహితుడు. నా స్నేహితుడి ద్వారా నా మొబైల్ నెంబ‌ర్‌ను సంపాదించాడు నవీన్‌. అయితే నేను తెర‌కెక్కించిన భీష్మ సినిమా ఆ వ్య‌క్తి చూసి ఇష్ట‌ప‌డ్డాను.. నేష‌న‌ల్ అవార్డు కోసం అప్లై చేయ‌మ‌న్నాడు. ఎందుకంటే ఈ సినిమా సేంద్రియ ప‌ద్ద‌తిలో వ్య‌వ‌సాయం చేయ‌డం అనే క‌థాంశంతో తెరకెక్కింది కాబట్టి..

అప్లై చేయ‌డం త‌ప్పు కాద‌ని భావించాను. న‌వీన్ అనే వ్య‌క్తి నా స్నేహితుడికి గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి తెలుసు క‌దా అని మా అసోసియేట్ డైరెక్ట‌ర్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ తెప్పించి అప్లికేష‌న్ ఫీజు రూ. 63,600 చెల్లించ‌డం జ‌రిగింది. కాగా ఆ డాక్యుమెంట్స్‌లో ఏదో మిస్టేక్ ఉంద‌ని న‌న్ను మ‌ళ్లీ డ‌బ్బులు అడిగాడు. దీంతో ఈ విష‌యంలో అనుమానం వ‌చ్చి అత‌న్ని బ్యాంక్ అకౌంట్ వ‌గైరా వంటివి తెలుసుకున్న పిద‌ప ఫిల్మ్ కార్పోరేష‌న్ సంస్థ త‌ర‌పున కాదు ఒక వ్య‌క్తి అకౌంట్ అని తెలిసింది.. వెంట‌నే నా ఫ్రెండ్‌కు ఫోన్ చేసి న‌వీన్ విష‌యం అడ‌గ్గా.. వాళ్లిద్ద‌రు ఎప్పుడు క‌ల‌వ‌లేద‌ని.. మెసెజ్‌లు మాత్ర‌మే చేసేవాళ్ల‌మ‌ని తెలిపాడు. గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ఇలాంటి మోస‌గాళ్లు నాలుపక్క‌ల వ‌స్తుంటారు. ప‌లు ర‌కాలైన మోసాలను పాల్ప‌డుతారు.. అయితే ఈ విష‌యంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయాలా? ఊరికే ఉండాలా అని నా స్నేహితులను అడిగా.. వాళ్లు వ‌ద్దు అని చెప్పారు. కానీ నేను ముందుకెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను. ఎందుకంటే మ‌ళ్లీ ఎవ‌రిని ఇలా మోసం చేయొద్ద‌ని.. సినీ ప‌రిశ్ర‌మ‌లో కాని, వేరే రంగంలో ఉన్నా వాళ్లు కానీ మోస పోకుడ‌ద‌నే ఉద్దేశ్యంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను.. పొగ‌త్రాగుట‌, మ‌ధ్యం సేవించుటే కాదు.. అప్ర‌మ‌త్తం లేకుండా కూడా హానిక‌ర‌మే అని వెంకీ కుడుముల అన్నారు.