యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం ఫిబ్రవరి16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు విఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
‘ఊరు పేరు భైరవకోన’ ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
-‘టైగర్’ తర్వాత నేను సందీప్ కలసి మరో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నాం. ‘డిస్కోరాజా’ తర్వాత ఈ కథ రాసుకునే సమయం దొరికింది. దీంతో పాటు మరో కథ కూడా వుంది. ఈ రెండు ఐడియాలని సందీప్ కి చెప్పినపుడు.. ‘ఊరు పేరు భైరవకోన’ కథకు చాలా ఎక్సయిట్ అయ్యారు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్త వుంటుంది, ఒక ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుదని ఫిక్స్ చేశాం. ఇప్పటివరకూ సందీప్ కూడా సూపర్ నేచురల్ ఫాంటసీ జోనర్ చేయలేదు. ఆయనకి కూడా ఇది చాలా డిఫరెంట్ గా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై విజువల్, సౌండ్ పరంగా ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. రాజేష్ అప్పటికి ఇంకా తొలి సినిమా నిర్మించలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలాఎక్సయిట్ అయ్యారు. నిజానికి హాస్య మూవీస్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 ‘ఊరు పేరు భైరవకోన’. మా మంచి కోరే వ్యక్తి అనిల్ గారు. ఆయన ఈ ప్రాజెక్ట్ లో వస్తే బావుంటుందని కోరుకున్నాం. అలా అనిల్ గారు జాయిన్ అవ్వడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది.
‘ఊరు పేరు భైరవకోన’ కథ అనుకున్నప్పుడే టైటిల్ పెట్టారా ? ఇందులో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం నేపధ్యం ఎలా ఉండబోతుంది ?
-కథ రాసిన తర్వాత డైలాగ్స్ రైటింగ్ టైంలో కొన్ని టైటిల్స్ అనుకున్నాం. అందులో
‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్ అనిపించి ఫిక్స్ చేశాం. టైటిల్ మైథాలజీ టచ్ వుంది. ఈ కథలో కూడా కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివడండం లాంటి నేపధ్యాలు వున్నాయి కాబట్టి ఈ టైటిల్ సరిగ్గా నప్పుతుంది. కర్మ సిద్ధాంతం నియమంలోనే ఈ కథ వుంటుంది. మన చేసిన కర్మ వేరే విధంగా తిరిగివస్తుంది. స్టొరీ లైన్ లోనే ఈ ఫిలాసఫీ వుంది. లైఫ్, డెత్ గురించి నాకు చాలా ఆసక్తి. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం గరుడపురాణంలో వివరంగా వుంది. ఈ జర్నీ చాలా ఆసక్తిని కలిగించింది.
అనిల్ సుంకర గారు ఈ సినిమా విజయం మా అందరికీ చాలా కీలకం అన్నారు కదా.. సినిమా మేకింగ్ సమయంలో ఈ విషయంలో ఒత్తిడికి లోనయ్యారా ?
-ఒత్తిడి అయితే వుంది. ఎంత గొప్ప కథ చెప్పినా, ఎంత పేరు వచ్చినా ఫైనల్ గా కమర్షియల్ సక్సెస్ కావాలి. ‘ఊరు పేరు భైరవకోన’ పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనే నమ్మకం వుంది. నా కెరీర్ లోనే బిగ్గర్ ఓపెనింగ్ భైరవకోనకి రావడం చాలా ఆనందంగా వుంది.
సాధారణంగా ఫాంటసీ అడ్వెంచర్ కథలకు విజువల్స్ కోసం బడ్జెట్ సమస్యలు వస్తుంటాయి.. ఈ సినిమా విషయంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కున్నారు ?
-ఈ సినిమాకి ప్రొడక్షన్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా రూపొందించాం. అలాగే ఎక్కడ కూడా వృధా చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అనిల్ గారు, రాజేష్ గారు కథని చాలా బలంగా నమ్మి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. జనాలని థియేటర్స్ తీసుకురావాలంటే వారికి కావాల్సిన విజువల్ ఎక్స్ పీరియన్స్, కంటెంట్ ఇవ్వాలని ముందే నిర్ణయించుకొని సినిమా చేశాం. ఇది యూత్, ఫ్యామిలీతో పాటు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది.
భైరవ కోనలో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ ఎలా వుంటుంది ?
-ఇందులో వెన్నెల కిషోర్ ట్రాక్ భలే వర్క్ అవుట్ అయ్యింది. డాక్టర్ నారప్ప అనే హిలేరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు. అలాగే వైవా హర్ష పాత్రలో కూడా ఫన్ ఎలిమెంట్ భలే కుదిరింది. అలాగే కావ్య థాపర్ లో కూడా చాలా ఫన్నీగా ఇంట్రస్టింగా వుంటుంది. ఇందులో చాలా మంచి ఫన్ వుంది. ఆడియన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫన్ రైడ్ లా వుంటుంది.
మీ సినిమాల్లో ట్విస్ట్ లు బావుంటాయి.. ఇందులో ట్విస్ట్ లు ఉన్నాయా ?
-రెండు పెద్ద ట్విస్ట్ లు వున్నాయి. వీటితో పాటు చిన్న చిన్న ట్విస్ట్ లు కూడా వున్నాయి. ప్రతి పదినిమిషాలకు ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా వుంటుంది. థియేటర్ లో ఎంజాయ్ చేసి చూసే సినిమా ఇది.
టైగర్ కి ఇప్పటికి సందీప్ కిషన్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ?
-సందీప్ లో అప్పుడు వున్న ఫైర్, ప్యాషన్ ఇప్పుడూ వుంది. తనకి అలసట లేదు. ప్రతి సినిమాని మొదటి సినిమాలనే నమ్మి పని చేస్తున్నారు. నటన పరంగా చాలా పరిణతి సాధించారు.
నిజమేనే చెబుతున్నా పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించారా ?
-నిజంగా ఊహించలేదు. పాట మాకు నచ్చింది. సినిమాలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే కీలకమైన పాట ఇది. వారి లవ్ కెమిస్ట్రీ కి హెల్ప్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద రీచ్ వస్తుందని అనుకోలేదు. శేఖర్ చంద్ర చక్కని ట్యూన్, శ్రీమణి లిరిక్స్, సిద్ శ్రీరామ్ వాయిస్.. ఇవన్నీ పాటని ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పాట ఇంత పెద్ద హిట్ అవ్వడం గొప్ప విషయం. ఇప్పుడున్న ఓపెనింగ్స్ కు ఈ పాట చాలా హెల్ప్ అయ్యింది.
మీరు పరిశ్రమకి వచ్చి పదేళ్ళు అవుతుంది..ఈ ప్రయాణం ఎలా అనిపించింది ?
-జర్నీ ఆనందంగా వుంది. అయితే ఇంకో మూడు చిత్రాలు ఫిల్మోగ్రఫీలో యాడ్ అయ్యింటే బావుండేదనిపిస్తుంటుంది. నా చేతిలో లేని పలు కారణాల వలన కొన్ని ప్రాజెక్ట్స్ ఆలస్యమయ్యాయి.
మీ కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
-నిఖిల్ తో ఓ సినిమా చర్చల్లో వుంది. కథ రాస్తున్నాను. అలాగే ఓ పెద్ద హీరోకి కథ రాస్తున్నాను. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.