Today Teja Birthday: చిత్రం-2కు సిద్ధ‌మ‌వుతున్న డైరెక్ట‌ర్ తేజ‌..

Today Teja Birthday: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం సినిమా అప్ప‌ట్లో బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో దివంగ‌త న‌టుడు ఉద‌య్‌కిర‌ణ్‌, రీమాసేన్ హీరోహీరోయిన్ల్‌గా న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఉషాకిర‌ణ్ మూవీస్ నిర్మించ‌గా.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ప‌నిలో ఉన్నారు ద‌ర్శ‌కుడు తేజ‌.

Today Teja Birthday నేడు తేజ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. చిత్రం 1.1 టైటిల్‌తో సీక్వెల్‌ను తీయ‌నున్న‌ట్లు తెలిపారు. చిత్రం సినిమా కోసం ప‌నిచేసిన 45మంది టెక్నిక‌ల్ టీమ్ ఈ సినిమాకు ప‌నిచేయ‌నుంది. సంగీతం ఆర్పీప‌ట్నాయ‌క్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే న‌టీన‌టులు ఇత‌ర వివ‌రాలను వెల్ల‌డించ‌నున్నారు.