విజయ్ దేవరకొండ – సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు – స్పష్టం చేసిన నిర్మాణ సంస్థ!!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపిన ఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లను చిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీ అవాస్తవాలని, విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్న ప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” సినిమా చేస్తున్నారు, దర్శకుడు సుకుమార్ “పుష్ప” సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఈ క్రేజీ సినిమా మరింత ప్రతిష్టాత్మకంగా,భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్ సంస్థ తెలిపింది.