దర్శకుడు సంపత్ నంది చేతలు మీదుగా “నయీం డైరీస్” మూవీ ట్రైలర్ లాంఛ్

గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ నయీం డైరీస్. ఈ
చిత్రంలో వశిష్ట సింహ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. దాము బాలాజీ దర్శకత్వం
వహిస్తున్న ఈ సినిమాన సీఏ వరదరాజు నిర్మిస్తున్నారు. నయీం డైరీస్ సినిమా
ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.
దర్శకుడు సంపత్ నంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్
విడుదల చేశారు. అనంతరం..

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ…..నయీం డైరీస్ ట్రైలర్ బాగుంది.
ఫిక్షనల్ స్టోరీస్ చేసేకంటే, ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ తో సినిమాలు
చేసినప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా మంది నన్ను
పంక్షన్స్ కు పిలుస్తుంటారు. నేను నో చెబితే నొచ్చుకుంటారు. వశిష్ట సింహా
కోసం నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. మా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో
ఆయన నటిస్తున్నారు. ఒక విప్లవకారుడు మోటార్ సైకిల్ లా నయీం డైరీస్ కూడా
పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో వశిష్ట సింహ మాట్లాడుతూ…ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చి సినిమా
గురించి మాట్లాడుతున్నాను. కొత్తగా ఉంది. కొంత టెన్షన్ గా ఉంది. చాలా
సినిమాలు చేసిన అనుభవం, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా నయీం డైరీస్ సినిమా
మీకు నచ్చుతుంది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ అవుతుంది. అన్నారు.

నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ…ఇది నా మొదటి సినిమా. రియల్ ఎస్టేట్
వ్యాపారంలో ఉన్న నాకు ఇది మొదటి సినిమా. దర్శకుడు బాలాజీ నాకు 20 ఏళ్లుగా
పరిచయం. నాకు సినిమాలు చేయాలని కోరిక. బాలాజీని కలిసి నాలుగైదు కథలు
విన్నాను. నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాగుంటుందని చేశాం.
వశిష్టను నేను కలిసి సెలెక్ట్ చేశాను. నయీం పాత్రకు ఆయనే కరెక్ట్
అనిపించింది. దర్శకుడు కూడా నాతో ఏకీభవించారు. మేము అనుకున్న దానికంటే
బాగా యాక్ట్ చేశారు. అన్నారు.

దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ..చాలా మంది నయీం డైరీస్ కథకు అడ్వాన్స్
ఇచ్చేందుకు కూడా భయపడుతుంటారు. కానీ మా నిర్మాత భయపడకుండా సినిమా
నిర్మించారు. నయీం అంటే భయపడే పరిస్థితి ఉందని నాకు గతంలో తెలియదు. మా
నిర్మాతలకు ముందుగా థాంక్స్ చెబుతున్న. నా మీద నమ్మకంతో సినిమా చేశారు.
కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు స్క్రిప్ట్ రచయితగా పనిచేశాను. ఐదేళ్ల కిందట
నయిం ఎన్ కౌంటర్ జరిగింది. ఆ తర్వాత అదో సెన్సేషన్ అయ్యింది. నయిం
గురించి అధ్యయనం చేశాను. నయిం అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు నేనూ
విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. కాబట్టి ఒక విప్లవకారుడు
ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో చూశాను. అవన్నీ డ్రమటిక్ గా నయీం డైరీస్
సినిమాలో చూపించాను. నయీం లొంగిపోయిన తర్వాత పోలీసులు, రాజకీయ నాయకులు
అతన్ని వాడుకుని నక్సలైట్లను అంతమొందించారు. ముల్లును ముల్లుతోనే తీయాలని
ప్రయత్నించారు. నయీం ఎందుకు క్రిమినల్ గా మారాడు, అతన్ని మించిన
క్రిమినల్స్ సొసైటీలో ఎవరు అనేది సినిమాలో డీటెయిల్ గా చూపిస్తున్నాం.
అన్నారు.

నటుడు ఫణి మాట్లాడుతూ…నేను ఈ చిత్రంలో నయీం బావమరిది క్యారెక్టర్
చేస్తున్నాను. వశిష్ట సింహ మా బావ క్యారెక్టర్ చేస్తున్నారు. మా
కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హ్యూమరస్ గా ఉంటాయి.

నటుడు శశి మాట్లాడుతూ…నయీం డైరీస్ షూటింగ్ రెండు మూడు ఫారెస్ట్ లో
షూటింగ్ చేశాం. చాలా రైర్ లొకేషన్స్ ను ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ ఎంత
ఇంట్రెస్టింగ్ గా ఉందో అంతకంటే ఆసక్తికరంగా సినిమా ఉంటుంది. అన్నారు.

యజ్ఞ శెట్టి, బిగ్ బాస్ దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి
తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – సురేష్
భార్గవ్, సంగీత – అరుణ్ ప్రభాకర్, ఎడిటర్ – కిషోర్ మద్దాలి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పద్మారెడ్డి.
పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ.