ఆర్ ఆర్ ఆర్ కోసం ఐర్లాండ్ స్టార్స్… రాజమౌళి మాస్టర్ ప్లాన్

ఆర్ ఆర్ ఆర్ సినిమాని వరల్డ్ మూవీ వరల్డ్ లో నిలబెట్టేలా… తెలుగు వాడి సత్తా, తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసేలా దర్శక ధీరుడు రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎన్టీఆర్, చరణ్ లాంటి మాస్ హీరోలని పెట్టుకోని, మనకి తెలిసిన పోరాట యోధుల పేర్లతో కల్పిత చెప్పడం అనేది పెద్ద సాహసం. ప్రపంచానికి తెలిసిన చరిత్రని పక్కన పెట్టేసి, పూర్తిగా కల్పిత కథతో సినిమాని తెరకెక్కిస్తున్న రాజమోళి, ట్రిపుల్ ఆర్ అప్డేట్ ఇచ్చేశాడు. హీరోయిన్, విలన్ గురించి బయటకి వచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కోలీవుడ్ నుంచి సముద్రఖనిని, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ ని తీసుకున్న జక్కన… ఇప్పుడు మెయిన్ విలన్ కోసం ఏకంగా హాలీవుడ్ వెళ్లాడు.

రామ్ చరణ్ హీరోయిన్ గా అలియా భట్ ఫైనల్ అవ్వగా, ఎన్టీఆర్ కోసం ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేశాడు. ఇంతకముందు ఈ పాత్రకి ఎడ్గార్ జోన్స్ ని సెలెక్ట్ చేశారు కానీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఎడ్గార్ ప్లేస్ లోకి ఒలీవియా వచ్చింది. కొమరం భీం పక్కన ఒలీవియా, జెన్నిఫర్ పాత్రలో కనిపించనుంది. అయితే ఎడ్గార్, ఒలీవియాలిద్దరూ స్టేజ్ ఆర్టిస్టులే కావడం విశేషం. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా స్థాయిని పెంచడానికి సినిమాలోకి వచ్చిన నటులు రే స్టీవెన్సన్, అలిసన్ డూడి విలన్లుగా కనిపించడానికి రెడీ అయ్యారు.

కింగ్ ఆర్థర్, డైవెర్జెంట్, థోర్ సిరీస్ లో నటించిన స్టీవెన్సన్ కి నటుడిగా మంచి పేరు ఉంది. సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసే స్టీవెన్సన్, 1998లో మొదటిసారి తెరపై కనిపించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ 20 ఏళ్లలో 23 సినిమాల్లో నటించాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో స్టీవెన్సన్, విలన్ పాత్రలో బ్రిటిష్ ఆఫీసర్ స్కాట్ గా కనిపించబోతున్నాడు, ఇది అతనికి 24వ సినిమా. స్కాట్ భార్యగా ఫిమేల్ యాంటాగోనిస్ట్ పాత్రలో అలిసన్ నటిస్తోంది. లేడీ స్కాట్ గా కనిపించనున్న అలిసన్… ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి భారీ చిత్రంలో నటించింది. 53 ఏళ్ల అలిసన్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. స్టీవెన్సన్, అలిసన్ లో ఉన్న కామన్ పాయింట్, ఈ ఇద్దరూ ఐర్లాండ్ వాళ్లు కావడం. బ్రిటిషర్లపై పోరాటం చేసిన తెలుగు వీరుల కథతో తెలుగు వాడు తీస్తున్న సినిమాకి ప్రపంచ సినిమా స్థాయి నటులు రావడం గొప్ప విషయం. ముఖ్యంగా అజయ్ దేవగన్, స్టీవెన్సన్, అలిసన్ లాంటి నటుల రాక ఆర్ ఆర్ ఆర్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పటికే ఈ హాలీవుడ్ యాక్టర్స్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. మెయిన్ కాస్ట్ పై రాజమౌళి సీన్స్ షూట్ చేస్తున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాని షూట్ చేస్తున్న జక్కన, అనుకున్న టైంకి జులై 30న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి ఆర్ ఆర్ ఆర్ ని రిలీజ్ చేయబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ట్రిపుల్ ఆర్ లేట్ గా రిలీజ్ అవుతుంది అనే మాట వినిపిస్తుంది కానీ 70% షూట్ అయిపొయిందని చెప్పి చిత్ర యూనిట్ రూమర్స్ కి పర్ఫెక్ట్ చెక్ పెట్టారు.