తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోస్ట్ చేసిన వీడియో చూసి పావలా శ్యామల గారికి సాయం చేయడానికి ముందుకి వచ్చిన ప్రముఖ నిర్మాత

సినిమా ఒక రంగుల ప్రపంచం ఇక్కడ లైట్స్ వెలుతురులో ఉన్నంత వరకూ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఒక్కసారి అక్కడి నుంచి పక్కకి వస్తే ఎంతో మందికి గాఢాంధకారమే. ప్రస్తుతం ఈ పరిస్థితినే ఎదురుకుంటున్నారు పావలా శ్యామల గారు. దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె. ఇప్పుడు వయసు మీదపడటంతో పాటు అవకాశాలు కూడా లేక పోవడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతినెలా వచ్చే ఫించన్‌ కూడా మూడు నెలల నుంచి రాకపోవడంతో ఇల్లుగడవడానికి తనకు వచ్చిన అవార్డుల్ని అమ్మేసుకున్నారు.

పావలా శ్యామల గారి కష్టం గురించి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ యూట్యూబ్ ఛానెల్ లో వీడియో పోస్ట్ చేశారు. శ్యామల గారి వీడియో చూసి ఆమెకి సహాయం చేయడానికి దర్శక నిర్మాత ఏషియన్ టింబర్ ఎస్టేట్స్ అధినేత చదలవాడ శ్రీనివాస రావు ముందుకి వచ్చారు. పావలా శ్యామల గారికి ఆర్ధికంగా సాయం చేస్తానని మాట ఇచ్చారు.