Tollywood: నాగార్జున స‌ర్ త‌న పాత్ర నచ్చే నాకు అవ‌కాశం ఇచ్చాడు: డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్

Tollywood: గరుడ‌వేగ ఫేం డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ చిత్ర‌ మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో నాగార్జున పాల్గొనే యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్ క్యానింగ్ చేస్తున్నారు. దీంతో ప్రవీణ్ సత్తారు పని తీరుతో నాగార్జున ఆకట్టుకున్నాడు. ఈ షెడ్యూల్ తరువాత, ఈ చిత్ర బృందం రెండవ షెడ్యూల్ కోసం మార్చి నెలలో గోవాకు బయలుదేరుతుంది. Tollywoodదీంట్లో నాగార్జున మాజీ భద్రతా ఏజెంట్ పాత్రలో కనిపించ‌నున్నాడు. ఆయ‌న ఇందులో రిటైర్డ్ రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్ (రా) అధికారిగా చూస్తార‌ని.. నాగార్జున‌ను ఎప్పుడూ చూడ‌ని లుక్‌లో ఈ సినిమాలో క‌నిపిస్తాడ‌ని..

ఈ చిత్రంలో నాగ్ లుక్ ప్ర‌ధాన హైలెట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా నాగార్జున గురించి, Tollywoodదర్శకుడు ప్రవీణ సత్తారు మాట్లాడుతూ, నాగార్జున సర్ నాకు అవకాశం ఇవ్వడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, ఈ చిత్రం కోసం నేను నాగార్జున గారి పాత్రను తీర్చిదిద్దిన‌ విధానం ఆయనకు నచ్చింది. ఈ క‌థ‌లోత‌న పాత్ర గురించి చెబుతున్న‌ప్పుడు నాగార్జున గారు ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. దీంతో ఈ చిత్ర స్క్రీప్ట్‌పై ఎంతో న‌మ్మ‌కం క‌లిగింది అని ప్ర‌వీణ్ స‌త్తార్ అన్నారు. ఇక Tollywoodఇందులో నాగార్జున స‌ర‌స‌న అనిఖా సురేంద్ర‌న్ హీరోయిన్‌గా చేస్తోంది.