వీళ్లిద్దరూ… మరోసారి!

హీరో నాని నిర్మించిన ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ప్రయోగాత్మక సినిమా చేసి మంచి దర్శకుడిగా నిలబడ్డారు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ ని ఇలా కూడా చూపించొచ్చా అనిపించేలా చేశాడు. ఇక మూడో సినిమా కూడా ప్రయోగమే చేసిన ప్రశాంత్ వర్మ తెలుగులో మొట్టమొదటి జాంబీ జానర్ సినిమా చేశారు. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బాంబీ రెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. తేజ సజ్జాని హీరోగా కూడా నిలబెట్టింది.

ఇక నాలుగో సినిమాగా ఆయన తెలుగులో నిజమైన సూపర్ హీరో హనుమాన్ అనే టైటిల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. HANU-MAN అంటూ గతంలో వదిలిన టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు కానీ హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో ఫుల్ సస్పెన్స్ మైంటైన్ చేశారు. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ ప్రశాంత్ వర్మ, జాంబీ రెడ్డి హీరోతోనే హనుమాన్ చేస్తున్నాడు. ఈరోజే ఈ సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. కొత్త జానర్ లో సినిమా చేసి హిట్ ఇచ్చిన ఈ కాంబో మరోసారి హనుమాన్ తో ఆడియన్స్ కి కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారేమో చూడాలి.