ఒక్క హిట్ ఇస్తాను… రాసిపెట్టుకోండి

ఎన్టీఆర్… ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న స్టార్ హీరో. గతంలో బ్యాడ్ ఫేజ్ లో ఉన్న తారక్, హరీశ్ శంకర్ తో కలిసి రామయ్య వస్తావయ్యా సినిమా చేశాడు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు, పైగా హరీశ్ శంకర్ రైటింగ్ స్కిల్స్ పై అందరికీ అంత నమ్మకం ఉండేది. దిల్ రాజు నిర్మించిన రామయ్య వస్తావయ్యా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి తలకిందులు అయ్యింది, హిట్ పక్కా అనుకున్న రిజల్ట్ తేడా కొట్టింది. ఎన్టీఆర్, హరీశ్ శంకర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయాడనే కామెంట్స్ వినిపించాయి. హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే నందమూరి అభిమానులు మాత్రం హరీశ్ శంకర్ ఎన్టీఆర్ ని చూపించిన విధానానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. తారక్ లోని ఎనర్జీని హరీశ్ శంకర్ పూర్తిగా వాడుకున్నాడు. రామయ్య వస్తావయ్యా తర్వాత ఎన్టీఆర్, హరీశ్ శంకర్ వాళ్ల వాళ్ల ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయారు. ఇప్పుడు హరీశ్ శంకర్ వాల్మీకి సినిమా చేస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. వాల్మీకి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ హరీశ్ శంకర్, ఎన్టీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయాను… ఆ ఋణం మిగిలిపోయింది అన్నాడు. ఏరోజైనా హరీశ్ శంకర్ మళ్లీ ఎన్టీఆర్ తో సినిమా చేయడా, హిట్ ఇవ్వకుండా పోతాడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ ఋణం తీర్చుకునే బాధ్యత నీ పైనే ఉంది హరీశ్ శంకర్, మంచి కథ రాసి తారక్ అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వు…