అసురన్ సినిమాకి రాక్షసుడు లాంటి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అసురన్. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. సురేష్ బాబు, కలైపులి థాను నిర్మిస్తున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా డైరెక్టర్ మాత్రం ఫైనల్ అవలేదు. నిజానికి కొన్ని రోజుల క్రితం అసురన్ తెలుగు రీమేక్ ని ఓంకార్ డైరెక్ట్ చేస్తాడనే వార్త వచ్చింది. ఇప్పుడు దీని కొట్టిపారేస్తూ కొత్త డైరెక్టర్ లైన్ లోకి వచ్చాడు.

Asuran Venkatesh

దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం అసురన్ సినిమాను తెలుగులో హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేస్తాడంటున్నారు. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన హను, మణిరత్నం ఇన్స్పిరేషన్ తో మూవీస్ తీస్తూ ఉంటాడు. విజువల్ గా స్టోరీ చెప్పడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే హను, అసురన్ రీమేక్ చేస్తే టెక్నీకల్ గా చాలా బాగుంటుంది. మరి ఈ వెంకీ, హను కాంబినేషన్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.