విలన్‌గా మారిన టాప్ డైరెక్టర్

లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గౌతమ్ మీనన్.. తన సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా కూడా గౌతమ్ మీనన్ మారాడు. ఇప్పటికే పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించిన గౌతమ్ మీనన్.. ఇప్పుడు విలన్‌గా మారబోతున్నాడట. శింబు హీరోగా కృష్ణ ఎన్ తెరకెక్కిస్తున్న సినిమాలో గౌతమ్ మీనన్ విలన్‌గా నటించనున్నాడట.

goutham menon villen

స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జానవేల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కృష్ణ ఎన్ గతంలో గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. దీంతో కృష్ణ ఎన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన సినిమాలో విలన్‌గా నటించేందుకు గౌతమ్ మీనన్ ఒకే చేప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శింబు గ్యాంగ్‌స్టార్ పాత్రలో నటించనున్నాడు. అటు డైరెక్టర్ మణిరత్నం నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్ను గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్నాడు.