‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌కు డైరెక్టర్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన దర్శకధీరుడు రాజమౌళి- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీలోకి రీమేక్ కానుందని, ఇందులో హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలగులో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి అక్కడ కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

chatrapathi

హిందీ ప్రేక్షకుల్లో కూడా శ్రీనివాస్‌కు ఆదరణ ఉండటంతో అతడితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఛత్రపతి హిందీ రీమేక్‌ను ఒక బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని మొన్నటివరకు వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్‌తో సాహో సినిమాను తెరకెక్కించిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌తో సుజీత్ చర్చలు జరుపుతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. సాహో సినిమాతో బాలీవుడ్‌లో డైరెక్టర్‌గా సుజీత్ అందరికీ పరిచయమయ్యాడు. దీంతో సుజీత్-బెల్లంకొండ కాంబోలో ఛత్రపతి సినిమా తెరకెక్కుతుందో .. లేదో చూడాలి.