Uppena: ఉప్పెన డైరెక్ట‌ర్‌కు బెంజ్ కారు గిఫ్ట్‌..

Uppena: మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్, శ్రీ‌నిధి శెట్టి జంట‌గా ఉప్పెన చిత్రం తెర‌కెక్కి.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకీ కొత్త ద‌ర్శ‌కుడిగా బుచ్చిబాబు సానా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఈయ‌న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ద్ద డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశాడు. తాను ద‌ర్శ‌కత్వం వ‌హించిన Uppena ఉప్పెన చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు.

మొద‌టి రోజే మంచి టాక్‌ను సంపాదించుకున్న ఈUppena చిత్రం వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో డైరెక్ట‌ర్ బుచ్చిబాబు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో వ‌రుస‌గా భారీ ఆఫర్లు వ‌స్తున్నాయి. కాగా తాజాగా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ రూ. 75ల‌క్ష‌లు విలువ చేసే బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ బెంజ్ కారులో మొద‌ట‌గా త‌న గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని చ‌క్క‌ర్లు కొట్టారు బుచ్చిబాబు సానా.