`ఎవ‌రికీ చెప్పొద్దు` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు

స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. చిన్న సినిమాల‌కు, కొత్త ద‌ర్శ‌కుల‌కు, యంగ్ టాలెంట్‌కు ఆయ‌న అందించే స‌పోర్టే ఆయ‌న్ను టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది. హిట్ చిత్రాల నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు మ‌రో ల‌వ్‌స్టోరీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఆగ‌స్ట్‌లో ఈ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

హీరో, నిర్మాత రాకేశ్ వ‌ర్రె మాట్లాడుతూ – హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ఆగస్ట్ లో ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దిల్‌రాజుగారు మా సినిమాను రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాకు స‌బంధించిన మ‌ర్నిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.

న‌టీన‌టులు:
రాకేశ్ వ‌ర్రె
గార్గేయి ఎల్లాప్ర‌గ‌డ‌

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: బ‌స‌వ శంక‌ర్‌
నిర్మాత‌: రాకేశ్ వ‌ర్రె
రిలీజ్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్‌
కెమెరా: విజ‌య్ జె.ఆనంద్‌
సంగీతం: శంక‌ర్ శ‌ర్మ‌
ఎడిట‌ర్స్‌: బ‌స‌వ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, స‌త్య‌జిత్ సుగ్గు
సౌండ్ డిజైన్‌: సింక్ సినిమా
పాట‌లు: వాసు వ‌ల‌బోజు
కాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మి
ఆర్ట్‌: ల‌క్ష్మి సింధూజా గ్రంధి
పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: కేత‌న్ కుమార్
క‌ల‌రిస్ట్‌: వివేకానంద్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనంత్‌( ప‌ద్మ శ్రీ యాడ్స్‌)
ప్రొడ‌క్ష‌న్ హౌస్‌: క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్