అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో SS రాజమౌళిని అన్‌ఫాలో చేసిందా ?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో భాగం కావాలని ప్రతి ఒక్క యాక్టర్ కోరుకుంటారు. RRR రూపంలో అలాంటి అవకాశమే అలియాకు దక్కింది. ఇందులో ఆమె రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో కనిపించింది.అయితే సినిమా ప్రారంభంలో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న అలియా.. ఆ తర్వాత ఈ మూవీ విషయంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే అలియా ఈ సినిమా సక్సెస్ గురించి సోషల్ మీడియాలో స్పందించకపోవడం.. ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనకపోవడాన్ని తెలుగు మీడియా సంస్థలు ఎత్తి చూపాయి.అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే RRR చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టులను ఇటీవల తొలగించింది.

దీనికి కారణం ఏమయ్యుంటుందా అని నెట్టింట పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటూ వస్తోన్న అలియా భట్.. లేటెస్టుగా RRR సినిమా గురించి పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆశ్చర్యపరిచింది. తన గురించి నెట్టింట వినిపిస్తోన్న రూమర్స్ కు చెక్ పెట్టాలనుకుందో ఏమో తెలియదు కానీ.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేసిన పోస్టర్ ను అలియా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.