Dhanush: ధ‌నుష్ జ‌గ‌మే తంత్రం టీజ‌ర్ రిలీజ్ చేసిన నెట్‌ప్లిక్స్‌..

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుశ్ న‌టించిన తాజా చిత్రం జ‌గ‌మే తంతిర‌మ్ ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది ధ‌నుశ్ కెరీర్‌లో 40వ సినిమాగా రూపొందింది. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. తెలుగులో జ‌గ‌మే తంత్రం అనే టైటిల్‌తో రాబోతుంది. వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్‌. శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను నెట్‌ప్లిక్స్ వారు రిలీజ్ చేశారు.

dhanush movie

ఇందులోDhanush ధ‌నుష్‌ను సురులి అనే ప్ర‌మాద‌క‌ర‌మైన గ్యాంగ్ స్టర్‌గా ప‌రిచ‌యం చేశారు. గ్యాంగ్ స్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ అత‌ని బిహేవియ‌ర్ చూస్తే ఫ‌న్నీ మ్యాన్ అని అర్థం అవుతోంది. ఇక ధ‌నుష్ ఎప్ప‌టిలాగానే త‌న‌దైన శైలి స్క్రీన్ ప్రెజ‌న్స్, డ్యాన్స్‌తో అల‌రించాడు. ఇక ఇందులో Dhanushధ‌నుశ్‌కు జోడీగా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌న్ స్వ‌రాలు అందించారు. ఇక త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని నెట్‌ప్లిక్స్ వెల్ల‌డించింది.