పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘దేవుడితో సహజీవనం’!!

సురేష్ నీలి ప్రొడక్షన్‌లో కాంట్రవర్శియల్ డైరెక్టర్ సాయిరామ్ దాసరి అందిస్తున్న మరో చిత్రం ‘దేవుడితో సహజీవనం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ మరియు గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపింది చిత్రయూనిట్. హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. ‘‘దేవుడితో సహజీవనం చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదరించిన ప్రేక్షకులకు చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రానికి సురేష్ నీలి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్టిస్టులందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలను నాకు నచ్చిన సినిమాలను ప్రేక్షకులకు అందజేయాలనేదే నా ఉద్దేశ్యం. అందుకే ఇది నా పదవ సినిమాగా మీ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం..’’ అని తెలిపారు.

హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి
మ్యూజిక్: డేవిడ్,
డిఓపి: తరుణ్ కె సోను,

ఎడిటర్: ప్రవీణ్,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాతలు: సాయిరామ్ దాసరి, సురేష్ నీలి, వంశీధర్ రెడ్డి,
కథ- మాటలు- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.