Nithin Movie: దేవీ, సిద్ శ్రీ‌రామ్ కాంబో సాంగ్ రిలీజ్ చేయ‌నున్న మ‌హేశ్‌!

Nithin Movie: టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా రంగ్‌దే చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే Nithin Movie ఈ చిత్రానికి సంబంధించిన బ‌స్టాండ్ అంటూ సాగే సాంగ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో ఫిదా చేసింది. ఇప్పుడు తాజాగా దేవీశ్రీ‌ప్ర‌సాద్ కంపోజిష‌న‌ల్‌లో యువ సంచ‌ల‌నం సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించిన నా క‌నులు ఎపుడు అనే సాంగ్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Rangde

ఈ మేర‌కు సాంగ్ ప్రోమో వీడియోను Nithin Movieచిత్ర‌బృందం రిలీజ్ చేశారు. నా క‌నులు ఎపుడు క‌న‌నే క‌న‌ని పెద‌వులెపుడు అన‌నే అనని హృద‌య‌మెపుడు విన‌నే విన‌నీ మాయ‌లో తేలుతున్నా అంటూ సిద్ శ్రీ‌రామ్ త‌న‌దైన శైలిలో పాడుతూ.. దేవీశ్రీ‌ప్ర‌సాద్ పియానోతో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ క‌నిపిస్తారు. ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. కాగా ఈ సాంగ్‌ను మార్చి 4న‌ సాయంత్రం 4.05గంట‌ల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిందిNithin Movie.