డ్రగ్స్ కేసులో రకుల్‌కి ఊరట

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కి ఊరట లభించింది. డ్రగ్స్ కేసులో తన పేరును ప్రస్తావిస్తూ మీడియాలో కథనాలు ప్రసారం చేయడంపై ఢిల్లీ హైకోర్టును రకుల్ ఆశ్రయించింది. ఈ కేసులో తన పేరును మీడియా ప్రస్తావించకుండా నోటీసులు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టును రకుల్ కోరింది. డ్రగ్స్ కేసుకు లింక్ పెడుతూ మీడియా తన పేరును పదే పదే ప్రసారం చేస్తుందని, దీని వల్ల తనకు పరువుకు భగం కలుగుతుందని ఈమె హైకోర్టులో ఫిర్యాదు చేసింది.

rakul

దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. రకుల్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రకుల్‌కి క్షమాపణలు చెబుతూ కథనాలు ప్రసారం చేయాలని పలు ఛానల్స్‌కి రకుల్ ప్రీత్ సింగ్ నోటీసులు జారీ చేసింది. ఇండియా టుడే, న్యూస్ నేషన్, ఏబీపీ,అజ్ తక్, ఇండియా టీవీ,టైమ్స్ నౌ ఛానళ్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ కేసులో రకుల్ పేరును ప్రస్తావిస్తూ రాసిన కథనాలకు సంబంధించిన లింక్స్‌ను వెబ్‌సైట్ వెంటనే డిలీట్ చేయాలని ఆదేశించింది.

కాగా బాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తితో రకుల్ జరిపిన ఛాటింగ్ గురించి ఎన్సీబీ రకుల్‌ను ప్రశ్నించింది. అయితే తనకు ఈ డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, స్నేహపూర్వకంగానే రియా చక్రవర్తితో ఛాటింగ్ చేశానని విచారణలో రకుల్ చెప్పింది.