అక్టోబర్ 8 నుంచి కొత్త సైరాని చూస్తారు

మెగాస్టార్ నటించిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ సొంతం చేసుకోని దసరా పండగని వారం రోజుల ముందే తెచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 270 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన సైరా 172 రెండు నిమిషాల డ్యూరేషన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే థియేటర్ లో చూడని కొన్ని సన్నివేశాలని మళ్లీ సినిమాలో యాడ్ చేయనున్నారు. సైరాలో నాలుగు పాటలు ఉండగా, అందులో ఒకటి చిరు తమన్నాపై డిజైన్ చేశారు. నిడివి కారణంగా ఈ పాటని ఫైనల్ వర్షన్ నుంచి తొలగించారు. విజువల్లీ గ్రాండ్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని ఇప్పుడు సినిమాలో కలపనున్నారు.

కట్ చేసిన ఈ నాలుగో సాంగ్ తో పాటు, కొన్ని సీన్లని కూడా యాడ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలని దసరా కానుకగా అక్టోబర్ 8 నుంచి యాడ్ చేయబోతున్నారు. పండగ కావడంతో థియేటర్స్ కి ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, పైగా రిపీటెడ్ గా సినిమా చూసే వాళ్లకి ఫ్రెష్ ఫీల్ తీసుకు రావడానికే ఈ సన్నివేశాలు కలుపుతున్నారట. ఇప్పటికే కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాకి కొత్త సన్నివేశాలు కూడా కలిస్తే బాక్సాఫీస్ దగ్గర సైరా జోష్ కి అడ్డే ఉండదు.