డిలే న్యూస్ తో మెగా నందమూరి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారా?

దర్శక ధీరుడు రాజమౌళి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. రామ్ చరణ్ అలియా భట్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ట్రిపుల్ ఆర్ సినిమా డిలే అవుతుందని మెగా నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంత వరకూ నిజం అనేది తెలియకుండానే ఎవరికి వారు నచ్చిన వార్త రాసుకుంటున్నారు.

చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం మేరకు, ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు ఉండే అవకాశం లేదు అంటున్నారు. రాజమౌళి ప్రణాలిక ప్రకారమే షూట్ చేస్తున్నాడని, ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ కూడా అలానే జరిగింది. సో ఏది ఏమైనా జక్కన్న చెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాని జులై 30న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదిలా ఉంటే కొమరం భీం బర్త్ డేకి మిస్ అయినా కూడా దీపావళికి మాత్రం ఆర్ ఆర్ ఆర్ టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం తప్పే ప్రసక్తే లేదు.