‘దీపికా పదుకొనే’ విచారణ.. ‘రణ్‌వీర్’ స్పెషల్ రిక్వెస్ట్?

దీపికా పదుకొనె తన మేనేజర్ కరిష్మా ప్రకాష్‌తో ‘మాల్’, ‘హాష్’ వంటి పదాలతో చాట్ చేసినట్లు కొన్ని సీక్రెట్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ వ్యవహారంలో దీపికా పదుకొనేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు పిలువగా తోడుగా ఆమె భర్త రణ్ వీర్ సింగ్ కూడా ఉండడానికి సిద్ధమయ్యాడు.

ఇటీవల కొత్త చిత్రం కోసం గోవా షూటింగ్‌కి వెళ్లిన ఆమెకు కాల్ చేసిన అధికారులు విచారణకు సంబంధించిన విషయాలను క్లారిటీగా చెప్పారు. ఇక ఇటీవల, దీపిక తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ముంబైకి తిరిగి రావడానికి చార్టర్ విమానం తీసుకుంది. ఇప్పుడు, సెప్టెంబర్ 26 న జరగబోయే విచారణలో తాను కూడా పాల్గొంటాను అని రణ్‌వీర్ ఎన్‌సిబిని కోరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీపికా కొన్నిసార్లు చిన్న విషయాలకె ఆందోళనతో బాధపడుతుందని అందుకే ఆమెను విచారిస్తున్నప్పుడు పక్కనే ఉండే అవకాశాన్ని ఇవ్వాలని రణ్‌వీర్ ఎన్‌సిబిని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ న్యూస్ ఏమి బయటకు రాలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.