లవ్ బ్రేకప్‌ విషయాలను బయటపెట్టిన దీపికా

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కొద్ది సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో వీరిద్దరి బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత మరో బాలీవుడ్ ఎగర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్‌తో దీపికా పదుకొణే ప్రేమలో పడింది. కొద్దికాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరు… ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమో వద్ద విల్లా డెల్ బాల్బియానెల్లో రణ్ వీర్ సింగ్, దీపికా జంట పెళ్లి చేసుకుంది.

DEEPIKA PADUKONE

అయితే తాజాగా మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్‌తో బ్రేకప్ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో దీపికా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. రణ్ బీర్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, అదే సమయంలో రణ్ వీర్ సింగ్‌తో అనుబంధం ఏర్పడిందని చెప్పింది. ఆరేళ్లపాటు రణ్ వీర్ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నానని, ఆ తర్వాత మంచి అనుబంధం ఏర్పడిందని దీపిక తెలిపింది. అది పెళ్లి దాకా వెళ్లినందుకు సంతోషంగా ఉందంది.

రణ్ వీర్ సింగ్‌ను 2012లో కలిశానని, అప్పుడే తమ మధ్య బంధం ఏర్పడిందని గ్రహించానంది. ఈ విషయాన్ని వెంటనే బయట పెట్టానని, అయితే అది క్యాజువల్ డేటింగ్ అని చెప్పింది. దీనిని సీరియస్‌గా తీసుకుంటానని రణ్ వీర్‌తో చెప్పలేదని, తనకు నచ్చిన వ్యక్తులు ఎదురుపడితే అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తానని తనతో ముందే చెప్పానని దీపిక తాజాగా వెల్లడించింది.