Bollywood: దీపిక‌ను యు బిచ్ అన్న నెటిజ‌న్‌.. రీట్వీట్ దిమ్మ‌తిరిగిపోయింది‌!

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొనేపై సోషల్ మీడియాలో ఓ నెటిజ‌న్ దుర్భాష‌లాడ‌డం తాజాగా వేడి పెంచింది. దీంతో దీపిక ఆ నెటిజ‌న్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. వివ‌రాల్లోకి వెళితే.. దీపిక ప‌దుకునే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజింగ్ ద్వారా ప‌దేప‌దే త‌న‌ని ట్రోల్ చేస్తూ వేధిస్తుడు ఒక నెటిజ‌న్‌.. ఈ క్ర‌మంలో దీపిక‌ను యు బిచ్ అంటూ కామెంట్ చేశారు. దీంతో దీపిక స్పందిస్తూ ఆ నెటిజ‌న్‌కు త‌గిన స‌మాధానం చెప్పింది..

వావ్! మీ కుటుంబం, స్నేహితులు మీ గురించి చాలా గర్వపడాలి “అని ఆ నెటిజ‌న్ చేసిన కామెంట్‌ను స్క్రీన్ షాట్ పై ఎగతాళి చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ నెటిజ‌న్ వెంట‌నే కామెంట్‌ను తొలగించాడు. ఇక ఏదీ ఏమైనా కానీ దీపిక చెప్పిన స‌మాధానానికి అతడిక సిగ్గొచ్చేలా చేయ‌డం హైలెట్‌గా నిలిచింది. Bollywood ఇక దీపిక న‌టించిన చివ‌రి చిత్రం మేఘ్నా గుల్జార్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌పాక్‌. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా చిత్రం హృతిక్ రోషన్ ఫైటర్ అనే చిత్రంలో కనిపించనుంది. అలాగే ఆమె రాబోయే ప్రాజెక్టులలో ది ఇంటర్న్ యొక్క హిందీ రీమేక్, ప్రభాస్ తో ఓ చిత్రం వీటితో పాటు ఆమె భర్త రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించినBollywood ’83 లో కూడా ఆమె నటించనుంది.