న్యూ ఇయర్ రోజు దీపికా పదుకొణె సంచలన నిర్ణయం

న్యూ ఇయర్‌లో చాలామంది ఏదోక కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఈ సంవత్సంలో ఏదోక కొత్త పని స్టార్ట్ చేయాలనో.. లేకపోతే ఏదోకటి సాధించాలని ఒక గోల్ పెట్టుకుంటారు. లేకపోతే ఉన్న అలవాట్లలో ఏదైనా అలవాటును మానుకోవడం, కొత్త అలవాట్లను నేర్చుకోవడం లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సంచలన నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయానికి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.

deepika padukone social media
deepika padukone social media

ఇంతకు ఈ బ్యూటీ తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా?.. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులన్నింటినీ దీపికా డిలీట్ చేసింది. దీంతో ప్రస్తుతం దీపికా పదుకొణె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టులు లేవు. పోస్టులన్నీ డిలీట్ చేయడంతో ఖాళీగా కనిపిస్తోంది. అంతేకాకుండా డిస్‌ప్లే పిశ్చర్‌ను కూడా మార్చింది. ఇందకు దీపికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటనేది తెలియలేదు. కొత్త సంవత్సరం రావడంతో.. పాత పోస్టులన్నీ డిలీట్ చేసిందని అభిమానులు చెబుతున్నారు.

ట్విట్టర్‌లో దీపికా పదుకొణెకు 2 కోట్ల 77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 5 కోట్ల 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల ఎంతోమంది సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్‌కు గురవుతున్నాయి. పూనమ్ పాండే‌తో పాటు చాలామంది అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. మరి దీపికా అకౌంటర్ ఏమైనా హ్యాక్‌కు గురయ్యాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.