సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుపై సిబిఐ దర్యాప్తును ఆమోదించిన సుప్రీంకోర్టు తీర్పును కంగామా ప్రశంసించింది. అనంతరం కంగనా రనౌత్ ‘డిప్రెషన్ డిబేట్’ పై కూడా దీపికా పదుకొనెపై కౌంటర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక మానసిక రోగి, సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో కొనసాగుతున్న వివాదాల మధ్య కంగనా రనౌత్ వరుస ట్వీట్స్ తో షాక్ ఇస్తోంది.
మొన్నటి వరకు ఆమె స్పందిస్తే చాలన్నా కంగనా ఇప్పుడు సుశాంత్ మరణ కేసుపై సిబిఐ దర్యాప్తును ఆమోదించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసిస్తూ దీపికా పదుకొనేను టార్గెట్ చేయడం వైరల్ అవుతోంది. ఈ ఉదయం, నటుడి మరణంలో సిబిఐ దర్యాప్తును సుప్రీంకోర్టు ఆమోదించింది. ఇక దీపికా పదుకొనే డిప్రెషన్ లో ఉందని ఆమె మానసిక అనారోగ్యం ఏ మాత్రం బాగోలేదని అందుకే కేసు విషయంలో సైలెంట్ గా ఉందని కామెంట్స్ చేసింది. ఆమెకు ఎవరైనా చికిత్స చేయిస్తే బావుంటుందని చెప్పిన కంగనా సుశాంత్ మరణ వార్త చాలా మందిని కదిలిచిందని అయితే కొందరరు మాత్రం భయంతో బ్రతుకుతున్నారని ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది. గతంలో రణ్ బీర్ ఒక రేపిస్ట్ అని కంగనా వివాదస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.