ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడి `పెళ్లిసంద‌D` పాట విడుద‌ల!!

ఏప్రిల్‌28.. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజు. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన అడివిరాముడు రిలీజైన రోజు. అదే ఏప్రిల్‌28 ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర‌ చరిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించి బాక్సాఫీస్ రికార్డుల‌కు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాహుబ‌లి 2 విడుద‌లైన రోజు. ఇలాంటి ఒక అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సార‌థ్యంలో రూపొందుతున్న పెళ్లిసంద‌D పాట‌ల సంద‌డి మొద‌ల‌వుతుంది.

1996లో విడుద‌లై ఏడాదిపాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌విజ‌యాన్ని సాధించ‌డ‌మేకాక పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది నాటి పెళ్లిసంద‌డి. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు మ‌ళ్లీ పెళ్లి సంద‌D చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఆ పెళ్లిసంద‌డికి సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త క‌థ‌. నాటి పెళ్లిసంద‌డిలో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి పెళ్లిసంద‌Dలో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌రవాణి కీర‌వాణి కాంభినేష‌న్‌లో అప్ప‌టి పెళ్లిసంద‌డి పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ పెళ్లిసంద‌Dకి కూడా కీర‌వాణి సంగీతం అందించ‌డం విశేషం.

ఈ ఏప్రిల్‌28న రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ పెళ్లిసంద‌Dలోని ఓ పాట‌ను విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ పాట‌తో మ‌రోసారి కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌లసంద‌డి మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది.

రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: చంద్ర‌బోస్
ఆర్ట్‌: కిర‌ణ్
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
‌ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌
బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్
స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి