Central Govt: సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్, బ్యానర్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుర్తింపు కలిగిన నటీనటులకు తగు విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అత్యున్నత పురస్కారాలతో సత్కరిస్తుంది. దీంట్లో భాగంగానే సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలు అయిన పద్మ అవార్డ్స్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్, నేషనల్ అవార్డ్స్ వంటితో సత్కరిస్తారు. అయితే ఇలాంటి పురస్కారాలు ఒకే సినిమాకు ఒకటి లేదా రెండు మూడు అవార్డ్స్ వస్తాయి.. కానీ ఒకే ఫ్యామిలీకి చెందిన నటీనటులకు ఇంతవరకు పురస్కారాలు లభించలేదు. కాగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌ల్లో, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న కోలీవుడ్ స్టార్స్ మామా అల్లుడు ఈ ఘనతను సంపాదించారు. ఎవరు ఆ మామా అల్లుడు అనుకుంటున్నారా?.. ఒకరు సూపర్‌స్టార్ రజనీకాంత్, మరోకరు మాస్ స్టార్ ధనుష్..
ఒకే కుటుంబానికి చెందిన హీరోలు సినీ రంగంలో ప్రతిష్టాత్మమైన అవార్డ్స్ దాదా సాహెబ్ ఫాల్కే, నేషనల్ అవార్డ్స్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. 2019కిగాను 51వ వ్యక్తిగా ఫాల్కే అవార్డును రజనీ సొంతం చేసుకున్నట్లు ఇటీవలే కేంద్ర మంత్రి ప్రకావ్ జవడేకర్ ప్రకటించగా.. అంతకు ముందే అసురన్ చిత్రంలో నటనకు, ఆయన అల్లుడు ధనుష్ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించింది. 67వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మే 3న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.. ఈ నేపథ్యంలో రజనీకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో రజనీని కూడా సత్కరించనుంది.. ఇలా ఒకే వేదికపై మామ అల్లుడు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకో్వడం పట్ల సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.