“డ్యాన్స్ రాజా డ్యాన్స్” అంటున్న మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య‌..

ప్ర‌ముఖ కొరియో‌గ్రాఫర్, న‌టుడు, ద‌ర్శ‌క‌డు ప్ర‌భుదేవా బ్ర‌ద‌ర్ నాగేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ చిత్రం త‌మిళ్‌లో తెర‌కెక్కింది. ఈ సినిమా త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించగా.. తెలుగులో డ్యాన్స్ రాజా డ్యాన్స్ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రాన్ని త‌మిళ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. భీమ‌వ‌రం టాకీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

అయితే ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ డాక్ట‌ర్ కొణిజేటి రోశ‌య్య ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. డ్యాన్స్ రాజా డ్యాన్స్ చిత్రం విజ‌యం సాధించి.. భారీగా డ‌బ్బులు రావాల‌ని అభిలాషించారు. అలాగే నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి మాట్లాడుతూ.. గౌర‌వ‌నీయులైన రోశ‌య్య గారి చేతుల మీదుగా త‌మ చిత్రం ఫ‌స్ట్ లుక్ లాంచ్ జ‌ర‌గ‌డం త‌మ‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని.. ఈ చిత్రం విజ‌యం కంటికి క‌నిపిస్తుంద‌ని తుమ్మ‌ల‌ప‌ల్లి అన్నారు. ఇక ఈ సినిమాలో ప్ర‌భుదేవా సోద‌రుడు నాగేంద్ర ప్ర‌సాద్‌తో పాటు.. రాజ్‌కుమార్‌, శ్రీ‌జిత్ ఘోష్‌, మ‌నోబాల‌, ఊర్వ‌శి, జూనియ‌ర్ బాల‌య్య కీల‌క పాత్ర‌లుగా న‌టిస్తుండ‌గా.. సింగ‌ర్ ఎం.ఎం. శ్రీ‌లేఖ ఈ చిత్రం కోసం నాలుగు పాట‌లు ఆల‌పించారు.‌