


డాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అయ్యిందని ప్రముఖ యాంకర్ , దర్శకుడు,డాన్స్ ఐకాన్ సీజన్ 2 హోస్ట్ ఓంకార్ తెలిపారు. డ్యాన్స్ ఐకాన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసని, డాన్స్ ఐకాన్ 2 అంతకుమించి అలరించబోతుందని చెప్పారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు డాన్స్ ఐకాన్ 2 టీం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ – “డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్” ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోస్ట్, శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ మీకు ఓవరాల్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్ టైన్ మెంట్..ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పర్ ఫార్మెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పర్ ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్ లతో పాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు,. డ్యాన్సర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్ లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ చేసే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్ . డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో. అని అన్నారు.



అనంతరం డాన్స్ ఐకాన్ 2 మెంటర్స్ మానస్, దీపిక మాట్లాడుతూ సీరియల్ లో భార్యాభర్తలుగా నటిస్తూ వచ్చామని, ఈ డ్యాన్స్ షోలో మాత్రం మెంటర్లుగా ఒకరితో మరొకరు పోటీపడబోతున్నామని తెలిపారు.ఇటువంటి అవకాశం కల్పించిన ఓంకార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. డ్యాన్స్ ఐకాన్ 2 ఊహలకు అందనివిధంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పారు.
ఈ సమావేశంలో మెంటర్ ప్రకృతి,డాన్స్ మాస్టర్ యశ్ తదితరులు పాల్గొన్నారు.