“డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” కోసం భారీ ప్రమోషన్

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ఆహా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్ ఫార్మెన్స్ లతో మెస్మరైజ్ చేస్తున్నారు.

“డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” కోసం భారీ ప్రమోషన్ చేస్తోంది ఆహా ఓటీటీ. హుస్సేన్ సాగర్ మధ్యలో 5 టన్నుల హ్యూజ్ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ కు వచ్చే పర్యాటకులను నీటిలో తేలియాడే ఈ హోర్డింగ్ ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఆహా ఓటీటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ విపిన్ ఉన్ని మాట్లాడుతూ – “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” షోకు హ్యూజ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ షోకు మరింత ప్రమోషన్ కల్పించేందుకు హుస్సేన్ సాగర్ మధ్యలో 5 టన్నుల హ్యూజ్ హోర్డింగ్ ఏర్పాటు చేశాం. ఇలాంటి హోర్డింగ్ ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. హుస్సేన్ సాగర్ కు వచ్చే పర్యాటకులను నీటిలో తేలియాడే ఈ హోర్డింగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్నారు.