Viay: తండ్రికి లీగ‌ల్ నోటీసులు పంపిన ద‌ళ‌ప‌తి విజ‌య్‌!

Viay: కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్.. త‌న‌ పేరు మీద రాజ‌కీయ పార్టీని రిజిస్ట్రేష‌న్ చేయించిన తండ్రికి లీగ‌ల్ నోటీసులు పంపారు. త‌న న్యాయ‌వాది ద్వారా విజ‌య్ త‌న తండ్రి చంద్ర‌శేఖ‌ర్‌కు లీగ‌ల్ నోటీసులు పంపించిన‌ట్టు స‌మాచారం. మీరు స్థాపించిన పార్టీలో విజ‌య్ పేరు లేదా ఫోటో వాడ‌కూడ‌ద‌ని ఆ లీగ‌ల్ నోటీసుల్లో ఉంద‌ట‌. ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్ట‌యితే న్యాయ‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని Viay విజ‌య్ త‌ర‌పు న్యాయ‌వాది పంపిన‌ నోటీసులో పేర్కొన్నారు.

గ‌త జూన్ నెల‌లో 8వ తేదీన అఖిల భార‌త ద‌ళ‌ప‌తి Viay విజ‌య్ మ‌క్క‌ల్ ఇయ్య‌క్కం అనే పేరుతో విజ‌య్ తండ్రి ఎస్‌.ఏ చంద్ర‌శేఖ‌ర్ రాజ‌కీయ పార్టీని రిజిస్ట‌ర్ చేయించారు.. ఈ చ‌ర్య‌ను ఖండిస్తూ విజ‌య్ ఆ స‌మ‌యంలోనే ఆ పార్టీతో ఎలాంటి సంబంధంలేద‌ని ప్ర‌క‌టించారు. అయితే Viayవిజ‌య్ మ‌క్క‌ల్ ఇయ్య‌క్కం అనేది ఇళ‌య‌ద‌ళ‌ప‌తి అభిమాన సంఘం పేరు.. ఈ పేరుతో త‌న తండ్రి రాజ‌కీయ పార్టీ రిజిస్ట‌ర్ చేయించ‌డం.. దాన్ని Viayవిజ‌య్ లీగ‌ల్‌గా స‌వాల్ చేయ‌డం త‌మిళ‌నాడులో చ‌ర్చనీయాంశంగా మారింది.