‘బీస్ట్’ మోడ్ లో దళపతి విజయ్…

సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ కి సరైన మొగుడు ఎవరు అంటే అందరినీ వినిపించే ఒకేఒక్క పేరు దళపతి విజయ్. ఇళయదళపతి నుంచి దళపతిగా మారి పాస్ట్ 6 ఇయర్స్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ ఇతర రాష్ట్రాల వరకూ తన ఇమేజ్ ని పెంచుకున్నాడు విజయ్. ముఖ్యంగా గత మూడేళ్లలో విజయ్ రజినీని మించేలా హిట్స్ ఇచ్చాడు. మెసేజ్ ఓరియెంటెడ్ కథలని కమర్షియల్ ఎలిమెంట్స్ కి లింక్ చేసే సినిమాలని చేస్తున్న విజయ్ బాక్సాఫీస్ దెగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాడు. తెలుగులో కూడా హిట్స్ ఇస్తున్న విజయ్, మాస్టర్ సినిమా తెలుగు వెర్షన్తో 12 కోట్లకు రాబట్టాడు. జూన్ 22న ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేశారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న విజయ్ 65 సినిమాకు బీస్ట్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.

శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్ సినిమాను తెరకెక్కించిన నెల్సన్, అది రిలీజ్ అవకముందే విజయ్ ని డైరక్ట్ చేసే ఆఫర్ అందుకున్నాడు. హీరో మాస్ ఇమేజ్ కి సరిపోయేలా పక్కా మాస్ కమర్షియల్ కథను సిద్ధం చేశాడు నెల్సన్. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. చేతిలో ఒక గన్ పట్టుకొని అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు దళపతి. మోడరన్ డాన్ గా కనిపించిన విజయ్ ని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏమున్నాడురా బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 80 కోట్ల పారితోషికం అందుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగులో కూడా బీస్ట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.