బ్రేకింగ్ న్యూస్: కరోనా భారిన పడిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు

కరోనా వైరస్ ధాటికి సాదారణ ప్రజలతో పాటు సెలెబ్రెటీలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు రాజకీయ నేతలు కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రముఖ రాజకీయా నాయకురాలు మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి గారు కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కామినేని హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం.

లాక్ డౌన్ మొదలైన తరువాత పురంధేశ్వరి గారి కుటుంబ సభ్యులతో పాటు ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇటీవల ఆమె బీజేపీ రాజకోయల్లో కాస్త చురుగ్గా పాల్గొన్నారు. ఆమెకు ఇటీవల పార్టీ అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. అయితే కరోనా ఎలా వచ్చిందో తెలియదు గాని ఆమె ఇటీవల కాస్త అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆమె ట్రీట్మెంట్ కోసం కామినేని హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె అయిన పురంధేశ్వరి 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికై న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 15వ లోక్ సభకు రెండవసారి ఎన్నికైనా తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పని చేశారు.