డ్రగ్స్ కేసు: ‘రియా’ బెయిల్ ని తిరస్కరించిన న్యాయస్థానం!!

రియా చక్రవర్తిని కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో ఎన్‌సిబి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడిని కూడా అరెస్టు చేయడంతో ఈ విషయం ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. రియా కారణంగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీ కూడా చిక్కుల్లో పడింది. సుశాంత్ సూసైడ్ కేసు నుంచి ఆమె అనేక కోణాల్లో చట్టపరమైన కేసులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

రియాతో పాటు ఆమె సోదరుడు కూడా గత కొన్ని రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. రియా మరియు ఆమె న్యాయవాదులు కొద్ది రోజుల క్రితం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, కాని రియా మరియు ఈ కేసులో పాల్గొన్న అనేకమందికి బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. ఇక నుంచి కేసు రానున్న రోజుల్లో మరింత కష్టతరం కానుంది. ఈ మాదకద్రవ్యాల దుర్వినియోగం, సేకరణ కేసులో రియాకు అలాగే ఆమె సోదరుడికి కఠినమైన శిక్ష పడుతుందని సమాచారం.