Corona Vaccine: కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికులకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇది పూర్తైన తర్వాత రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ రెండోదశలో ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్నారని తెలుస్తోంది. మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, 50 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులకు వ్యాక్సిన్ వేసే అవకాశముందని సమాచారం. అలాగే 50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రజలతో పాటు 50 ఏళ్ల లోపు ఉండి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా రెండో దశలో వ్యాక్సిన్ వేయనున్నారని తెలస్తోంది.