మా వీరుడు మన్యంపులి కొమురం భీమ్.. RRR టీజర్ పై సీతక్క కామెంట్

పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ ఒకటి. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడో టీజర్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తుండగా.. కొమురం భీం పాత్రలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

కొమురం భీం జయంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్ కూడా బెస్ట్ అనిపించింది. ఇక ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకురాలు సీతక్క ట్విటర్‌ ద్వారా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. ‘‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమురం భీమ్ గారి జయంతి రోజు నా ఘన నివాళులు. మా వీరుడు మన్యంపులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్‌కి నా అభినందనలు’’ అంటూ సీతక్క ట్వీట్‌ చేశారు. కొమురం భీం జయంతి రోజున విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ప్రస్తుతం RRR టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.