ఆంధ్ర ప్రదేశ్ నూతన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు

ఆంధ్ర ప్రదేశ్ 2024 ఎన్నికలలో గెలిచినా ఎన్డిఏ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల ప్రమాణ స్వీకారాలు కాగా గెలిచిన కొంతమంది ఎంఎల్ఏ లకు మంత్రి బాధ్యతలు అప్పగించారు. వాటిలో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అలాగే కందుల దుర్గేష్ గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే ముద్దాడ రవిచంద్ర గారిని ప్రిన్సిపాల్ సెక్రెటరీగా, నీరభ్ కుమార్ ప్రసాద్ గారిని చీఫ్ సెక్రెటరీగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి వారికి అభినందనలు తెలిపారు.