నందమూరి బాలకృష్ణ గారు మూడవసారి హిందూపూర్ ఎంఎల్ఎ గా గాలిచినందుకు అభినందనలు తెలుపుతూ

తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవ తారకం కాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షులు గా సేవలందిస్తూ, హిందూపురం మూడసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున వారిని కలిసి అభినందనలు తెలియచేసినారు.


తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశం 26-06-2024 న విజయవాడలో జరుగుచున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, హెచ్ ఆర్ డి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారిని కలిసి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందుటకు చర్చలు జరపటానికి వారి అపాయింట్మెంట్ కోరియున్నాము.