శ్యామ్ కె నాయుడిపై పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని గతంలో శ్యామ్ కె నాయుడిపై శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఆ కేసు సంచలనం సృష్టించగా.. తాజాగా మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చింది.

shyam k naidu case

ఆ కేసు వెనక్కి తీసుకోవాలంటూ తనను శ్యామ్ కె నాయుడు బెదిరిస్తున్నాడని తాజాగా శ్రీసుధ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని కోరింది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు శ్రీసుధ ఫిర్యాదులో పేర్కొంది.