సప్తగిరి అత్యుత్సాహం – ఇబ్బంది పడ్డ భక్తులు

తెలుగు చిత్రం నటుడు కమెడియన్ సప్తగిరి ఇటీవల చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ జాతరలో హెలికాప్టర్ ద్వారా టిడిపి నేత ఆర్టీవి బాబు, కమెడియన్ సప్తగిరి కలిసి పూలు చల్లడం జరిగింది. అయితే హెలికాప్టర్ కిందకి దిగుతూ ఉండగా దాని నుండి వచ్చిన గాలికి అక్కడ వేసిన షామియానాలు కూలిపోయి అక్కడ భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆ సంఘటన వల్ల పెను ప్రమాదం తృటిలో తప్పడం జరిగింది. దానితో అక్కడ భక్తులంతా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.