పవన్ కళ్యాణ్ ఓజి షూటింగ్ పై క్లారిటీ

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా పై వివిధ కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ ఎన్నికలలో బిజీగా ఉండగా ఆయన సినిమా ఓజి షూటింగ్ గురించి రుమౌర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో మరో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా మేకర్స్ డేట్ ల కోసం వేచి చుస్తున్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటారు అని కొన్ని రుమౌర్స్ వస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఎన్నికల ఫలితాలు విడుదల అయినా తరువాతే మిగిలిన షూటింగ్ లో జాయిన్ అవుతారని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రిలీజ్ డేట్ అయినా 27 సెప్టెంబర్ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది అని తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడం విశేషం.