ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. తారక్ అభిమానులకు మైత్రి మూవీ మేకర్స్ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న సినిమా ప్రారంభం కానుంది. అయితే దీని తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమాపై కూడా తాజాగా క్లారిటీ వచ్చింది.

NTR NEXT MOVIE

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండటంతో.. ఎన్టీఆర్‌తో సినిమా ఇప్పట్లో ఉండదని అందరూ భావించారు. కానీ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.

వచ్చే ఏడాది ఆరంభంలో ఇది తెరకెక్కే అవకాశముందని తెలిపింది. భారీ పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించనున్నట్లు చెప్పింది.