Powerstar: వ‌కీల్‌సాబ్ ట్రైల‌ర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సినీ క్రిటిక్..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజా చిత్ర‌మైన వ‌కీల్ సాబ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో రికార్డు సృష్టిస్తుంది.. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో రికార్డు వ్యూస్‌, లైక్స్‌తో దూసుకెళ్తుంటే.. తాజాగా సినీ క్రిటిక్ చ‌క్ర మ‌ల్లిఖార్జున‌ వ‌కీల్ సాబ్ ట్రైల‌ర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. వ‌కీల్ సాబ్ చిత్ర టైల‌ర్ చూసిన త‌ర్వాత బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ పింక్ ట్రైల‌ర్‌ను చూడాల్సి వ‌చ్చింది..

అందులో తాప్సీ గొప్ప న‌ట‌న కోసం, అమితాబ్ గంభీర‌మైన మాట‌ల కోసం వ‌కీల్ సాబ్‌లో ఏమాత్రం క‌నిపించ‌లేదు.. కానీ ఈ చిత్రం క‌థ ప‌రంగా అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతుందనే ఆ న‌మ్మ‌కం ఉంది.. ట్రైల‌ర్ కూడా మాస్‌ని ఎట్రాక్ట్ చేసే విధంగా ప్రెజెంట్ చేశారు. కాక‌పోతే బాలీవుడ్ స్థాయిని అందుకో లేక పోయామే అని ఎక్క‌డో చిన్న వెలితి. ఏది ఏమైనా సత్తా చాటే అవ‌కాశం కోల్పోయాం. ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కార‌ణంగా రికార్డ్ యూట్యూబ్ వ్యూస్‌, ఆహా, ఓహోలు మామూలే ఎంజాయ్ వ‌కీల్ సాబ్ అంటూ సినీ క్రిటిక్ చ‌క్ర మ‌ల్లిఖార్జున్ తెలిపారు.‌