కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు

‘కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లకు కనీస డిమాండ్ ఛార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్‌లో షోలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టికెట్లు ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి. కేసీఆర్ నేతృత్వంలో ఆయన విజన్‌కి తగ్గట్లుగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి సాధించి దేశంలోనే మొదటి స్థానాన్ని పొందుతున్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

chiru

ఇక చిరంజీవి ట్వీట్‌ను షేర్ చేసిన రాంచరణ్.. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినిమా ఇండస్ట్రీని సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడతాయన్నారు. దీనికి గాను కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు రాంచరణ్ తెలిపారు.

ఇక సీఎం కేసీఆర్‌కు హీరో నాగార్జున కూడా ధన్యవాదాలు చెప్పాడు. అటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి రాయితీలు ఇచ్చినందుకు పలువురు సినీ ప్రముఖులు కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు.