శ్రీకాంత్ చేతుల మీదుగా ‘చివరి క్షణం’ ఫస్ట్ లుక్

రత్న మేఘన క్రియేషన్స్ పతాకం పై  శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం ‘చివరి క్షణం’. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్, కవిత మహతో  హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  కాగా సోమవారం  వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతులమీదుగా విడుదల గావించారు. విడుదలైన అనతి కాలంలోనే ఫస్ట్ లుక్ కు విశేష స్పందిన లభించడం గమనార్హం. ఈ  సంధర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సోమవారం హీరో శ్రీకాంత్ గారు మాచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. అయన విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ ‘చివరిక్షణం’ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్, మంచిర్యాల లొకేషన్స్ లో టాకీ పార్ట్ మరియు ఒక సాంగ్ ను  షూట్ చేసాము. మిగిలిన మూడు పాటలను గోవాలో షూట్ చేశాము. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలియచేసారు. 

ఆదిత్య శశాంక్, కవిత మహతో, సాకేత్ సాయి రామ్, స్నేహ, కోటయ్య, చౌదరి, రాథోడ్, రామ్ కుర్నవల్లి, మురళి, రామకృష్ణ, వి ఎస్ రామ రాజు, జ్యోతి, రాంరెడ్డి, దాస్, సంపత్ తదితరులు నటిస్తున్నారు. 

సాంకేతిక వర్గం: కథ-దర్శకత్వం: ధర్మ, ప్రొడ్యూసర్: రత్న మేఘన క్రియేషన్స్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సతీష్, మహతి జై, వీరేపల్లి ప్రీతం, మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ సాయి రామ్, లిరిక్ రైటర్స్: ప్రవీణ్ సబ్బు,రమణ లోక్, వీరేంద్ర ఈమణి, రామ్ కుర్ణవల్లి, డిఒపి: శ్రీనివాస్ శ్రీరాముల, ఎడిటింగ్: కృష్ణ పుత్ర జై, డైలాగ్స్: నంద కిషోర్, ఫణి కుమార్, కొరియోగ్రఫీ: వినయ్, కో- డైరెక్టర్స్: రామ్ మోహన్ రావు, రామ్ కుర్నవల్లి.