బాగా వినిపిస్తున్న “చిత్రపటం” మొదటి లిరికల్ సాంగ్.!

ప్రముఖ కవి, రచయిత, సంగీత దర్శకుడు గా మనల్ని ఇంతకాలం అలరించిన బండారు దానయ్య కవి దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో తుది మెరుగులు దిద్దుకుంటున్న సినిమా “చిత్రపటం”. ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ మరియు మోషన్ టీజర్ విడుదల అయి ప్రేక్షకులను అలరించిన సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ సీనియర్ నటులు కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, నరేన్, శరణ్య పొన్నవన్, బాహుబలి ప్రభాకర్, పార్వతీశం, బాలాచారి, శ్రీవల్లి వంటి నటీనటులు నటించిన ఈ చిత్రపటం సినిమా నుండి మొదటి టైటిల్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ గేయ రచయత చంద్రబోస్ రిలీజ్ చేసారు. “నా పేరే చిత్రపటం మా ఊరే బౌద్దమఠం..” అంటూ మొదలయ్యే ఈ పాటకు యూట్యూబ్ లో కేవలం నాలుగు రోజుల్లో 2మిలియన్ వరకూ వ్యూస్ రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది, మ్యూజిక్ లవర్స్ మా పాటను ఆధరిస్తూ మాకు పాటలోనే సినిమా ఎంత గొప్పగా ఉండనుందో అర్ధమవుతుంది, చాలా కాలం తరువాత ఒక స్వఛ్చమైన సాహిత్యం ఉన్న గొప్ప పాటను విన్నాము అంటూ కామెంట్స్ చేయడం ఆనందాన్ని ఇస్తుంది అని దర్శకుడు బండారు దానయ్య కవి తెలిపారు. ఈ సినిమాలో కథ, కథనం, పాత్రల తీరు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసాము అనే అనుభూతిని ఖచ్చితంగా కలిగిస్తాయి అని ఆయన తెలియజేసారు.
అయితే ఈ సినిమా నుండి టీజర్ అతి త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు కెమెరా ఎస్ మురళీ మోహన్ రెడ్డి, నిర్మాత పుప్పాల శ్రీధర్ రావు, కథ కథనం మాటలు పాటలు సంగీతం దర్శకత్వం బండారు దానయ్య కవి.